ప్రమోషన్ పోస్టులు భర్తీ చేయండి

దిశ, న్యూస్‌బ్యూరో: గత రెండేళ్లుగా సివిల్ సర్జన్ ప్రమోషన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఆ పోస్టులకు అర్హత ఉన్నవారు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసిన వైద్యుల సంఘం డిహెచ్ విభాగం అధ్యక్షులు లాలూప్రసాద్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దీనదయాల్‌లు విన్నవించారు. బుధవారం మంత్రి ఈటలను కలిసి అపరిష్కృతంగా ఉన్న వైద్యుల సమస్యలపై వివరించారు. సీనియర్లకు పదోన్నతులలో జరుగుతున్న అన్యాయం ఈ వైద్య ఆరోగ్యశాఖలో తప్ప మరే […]

Update: 2020-08-12 10:08 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గత రెండేళ్లుగా సివిల్ సర్జన్ ప్రమోషన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఆ పోస్టులకు అర్హత ఉన్నవారు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసిన వైద్యుల సంఘం డిహెచ్ విభాగం అధ్యక్షులు లాలూప్రసాద్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దీనదయాల్‌లు విన్నవించారు. బుధవారం మంత్రి ఈటలను కలిసి అపరిష్కృతంగా ఉన్న వైద్యుల సమస్యలపై వివరించారు. సీనియర్లకు పదోన్నతులలో జరుగుతున్న అన్యాయం ఈ వైద్య ఆరోగ్యశాఖలో తప్ప మరే ఇతర శాఖలో లేదని రాథోడ్ చెప్పారు. డాక్టర్ నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరినట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, సిబ్బంది తమ శక్తికి మించి ప్రభుత్వానికి అండగా ఉంటూ కరోనాపై పోరాటం చేస్తున్నారని అన్నారు. వైద్య కళాశాలల ఆచార్యులకు పదవీ విరమణ వయసు పెంచిన విధంగానే వైద్య ఆరోగ్య శాఖలోని నాన్‌టీచింగ్ వైద్యులకు కూడా పదవీ విరమణ వయసు పెంచాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News