వ్యవసాయ ఉత్పత్తులకు వారంలోగా యాప్: జగన్
వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల నేపథ్యంలో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పలు చోట్ల కోతకు వచ్చిన పంటను కోసే పరిస్థితులు లేవు. కోసిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేవు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదు. ఆంక్షల నేపథ్యంలో కోనగోలు దారులు […]
వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల నేపథ్యంలో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పలు చోట్ల కోతకు వచ్చిన పంటను కోసే పరిస్థితులు లేవు.
కోసిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేవు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదు. ఆంక్షల నేపథ్యంలో కోనగోలు దారులు ముందుకు రావడంలేదు. దీంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆక్వా, పౌల్ట్రీ రంగాలది కూడా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను నష్టాల నుంచి ఆదుకునేందుకు పంటలకు ధరల రూపకల్పన, రైతుల ఉత్పత్తుల కొనుగోళ్ల తీరు తెన్నులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పంటలు, వాటి పరిస్థితి, ఉత్పత్తి, ధరలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన యాప్‌ను వారంలోగా అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా సూచించారు.
చీని, బొప్పాయి, అరటి, మామిడి, టమాటా రైతులకు ఇబ్బందులు రాకూడదని ఆయన సూచించారు. వీటి మార్కెటింగ్, నిల్వకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి, అనంతపురం, కడప జిల్లాల్లోని రైతులను ఆదుకోవాలని సూచించారు. రైతు బజార్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రయోగాత్మకంగా పంటల ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించాలని సూచించారు.
సీఎం సూచనకు పంట నూర్పిడిలో ఇబ్బందులు రాకుండా పలు రాష్ట్రాల నుంచి హార్వెస్టర్‌లను తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన రెడ్‌జోన్లలో ఉన్న కర్నూలు, గుంటూరుల్లోని మార్కెట్ యార్డులను తాత్కాలికంగా వేరే చోటుకు తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే ఆక్వా రైతులకు నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బెంగాల్, అసోం, బిహార్ లాంటి రాష్ట్రాలకు చేపలు రవాణా చేయడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన వారిని ఆదేశించారు. మే 31 నాటికి రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Tags: agriculture, marketing app, agricultural products, ap cm, jagan, review meeting