మహిళా పోలీసులకు జగన్ వరాల జల్లు

దిశ, డెస్క్ వెబ్: మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అలాగే దిశ చట్టాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు […]

Update: 2021-03-04 09:23 GMT

దిశ, డెస్క్ వెబ్: మహిళల భద్రతే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అలాగే దిశ చట్టాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని కోరారు. అలాగే ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సత్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్‌ లీవ్స్‌ ఇచ్చేందుకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్‌, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.

పదో తరగతి పూర్తిచేసిన బాలికలకు ప్లస్‌–1, ప్లస్‌–2ల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను అదేశించారు. ఇంటర్ ఆ పై తరగతుల వరకు ‘దిశ’ పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ఆ హోర్డింగ్స్ లలో ‘దిశ యాప్‌’తోపాటు అన్ని రకాల వివరాలు ఉంచాలని సూచించారు. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, వాటిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. మహిళల రక్షణ కోసం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News