ఏపీలో అమానవీయ ఘటన

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఖననం చేయకుండా 5 గ్రామాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. అంత్యక్రియలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి బంధువులు వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీ వాసి వారంరోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే శ్వాసతీసుకోవడం కష్టమవుతుండటంతో డాక్టర్లు తిరుపతిలోని ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. దీంతో వలసపల్లెలో […]

Update: 2020-07-12 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఖననం చేయకుండా 5 గ్రామాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. అంత్యక్రియలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి బంధువులు వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీ వాసి వారంరోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే శ్వాసతీసుకోవడం కష్టమవుతుండటంతో డాక్టర్లు తిరుపతిలోని ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. దీంతో వలసపల్లెలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువులు యత్నించడంతో చుట్టు పక్కలకు చెందిన 5 గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కరోనాతోనే చనిపోయాడన్న అనుమానంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు. బంధువులు ఎంత చెప్పినా వినకపోవడంతో మృతదేహానికి కరోనా పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం నుంచి అటు అంత్యక్రియలు జరగకపోవడం, ఇటు కరోనా టెస్టులు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

Tags:    

Similar News