TDP : 'మీ పేర్లు రాసిపెట్టుకుంటున్నాం.. మూల్యం చెల్లించుకోక తప్పదు'

దిశ, ఏపీ బ్యూరో: పోలీసు వ్యవస్థపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు మెుత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చి పెడుతోందని ఆరోపిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు తాము రాసిపెట్టుకుంటున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. […]

Update: 2021-09-13 03:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: పోలీసు వ్యవస్థపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు మెుత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చి పెడుతోందని ఆరోపిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు తాము రాసిపెట్టుకుంటున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

పోలీసులు ఇప్పటికైనా చట్టం ప్రకారం నడుచుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలనలో అక్రమ కేసులతో పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్ఐఆర్‌లు నిండిపోయాయని విమర్శించారు. కొందరు పోలీసుల చర్యలు శృతి మించుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త అంజిపై చిన్నమండెం ఎస్ఐ మెుయినుద్దీన్ లాకప్‌లో పెట్టి చిత్ర హింసలకు గురి చేయడం దారుణమని అచ్చెన్న మండిపడ్డారు. అలాగే కండ్రికలో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశార‌ని.. అయితే తిరిగి త‌మ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు న‌మోదు చేశార‌ని అచ్చెన్నాయుడు ప్రకటనలో ఆరోపించారు.

Tags:    

Similar News