మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఓటర్లు భారీగా చేరుకోవడంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగుతుండగా.. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు అనంతరం […]

Update: 2021-03-09 20:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఓటర్లు భారీగా చేరుకోవడంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగుతుండగా.. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు అనంతరం వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. 12 కార్పొరేషన్లలోని 671 డివిజన్లలో 90 ఏకగ్రీవం అవ్వగా.. మిగిలిన 581 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది.

ఇక 74 పరపాలక, నగర పంచాయతీల్లో 2,123 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 2,123 వార్డులకు 490 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 71 పురపాలక, నగర పంచాయతీల్లో మిగిలిన 1,633 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 12 కార్పొరేషన్లలో 2,569 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పురపాలక, నగర పంచాయతీల్లో 4,981 మంది పోటీలో ఉన్నారు.

Tags:    

Similar News