ఏపీ కరోనా పరీక్షల యాప్

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. కేసులు ఎంత భారీగా నమోదవుతున్నాయో, కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అంతే భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు పది లక్షల కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కోవిడ్‌-19 ఏపీ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటోన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా […]

Update: 2020-07-07 04:27 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. కేసులు ఎంత భారీగా నమోదవుతున్నాయో, కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అంతే భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు పది లక్షల కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కోవిడ్‌-19 ఏపీ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటోన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఈ యాప్‌ను వినియోగిస్తోంది. ‘మీకు కోవిడ్‌-19 లక్షణాలు ఉన్నట్లయితే కోవిడ్‌-19 ఏపీ యాప్ లో మీ వివరాలు పొందుపరిచి వెంటనే కరోనా పరీక్షలను కోరండి. అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ పరీక్ష పూర్తిగా ఉచితం’ అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News