చివరి నిమిషంలో జగన్ పర్యటన వాయిదా?
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం 10:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాల్సిన సీఎం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో వెళ్లలేదని తెలుస్తోన్నది. కాగా, కృష్ణా నదీ జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుపై జగన్ నేడు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం 10:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాల్సిన సీఎం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో వెళ్లలేదని తెలుస్తోన్నది. కాగా, కృష్ణా నదీ జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుపై జగన్ నేడు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్టుల్లో వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంతో పాటు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడిందని సమాచారం. దీనికి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.