తిరుమల శ్రీవారి సందర్శనలో హైకోర్టు చీఫ్ జస్టిస్..

దిశ, ఏపీబ్యూరో: రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉద‌యం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో న్యాయమూర్తి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు న్యాయమూర్తికి ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అద‌న‌పు […]

Update: 2021-09-12 02:29 GMT

దిశ, ఏపీబ్యూరో: రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉద‌యం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో న్యాయమూర్తి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు న్యాయమూర్తికి ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అద‌న‌పు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించారు. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సైతం దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ జేఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ గోస్వామి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జేఈవో సదాభార్గవి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News