బిగ్ బ్రేకింగ్ : ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. గతేడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. గతేడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం.తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో అధికారులు కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసేపనిలో పడ్డారు. కోర్టు తీర్పు ఆదేశాలు వెలువడిన వెంటనే ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కలుగుతుంది.