ఏపీలో ఉభయతారక ప్రయోజన పథకం

ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినూత్న పథకాన్ని ప్రారంభించింది. కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఇద్దరిని ఆదుకునేలా ‘ఉభయతారక ప్రయోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులు పడించిన కూరగాయాలు, పండ్లను వారి నుంచి నేరుగా కొనుగోలు చేసి పట్టణాలలోని వినియోగదారులకు అమ్మడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఉద్యాన వన శాఖకు అప్పగించింది. ప్రస్తుత విపత్తు సమయంలోనే […]

Update: 2020-04-07 01:54 GMT

ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినూత్న పథకాన్ని ప్రారంభించింది. కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ఇద్దరిని ఆదుకునేలా ‘ఉభయతారక ప్రయోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులు పడించిన కూరగాయాలు, పండ్లను వారి నుంచి నేరుగా కొనుగోలు చేసి పట్టణాలలోని వినియోగదారులకు అమ్మడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఉద్యాన వన శాఖకు అప్పగించింది. ప్రస్తుత విపత్తు సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ నమూనాను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏప్రిల్ 4న సర్కులర్‌ జారీ చేసింది.

Tags: ubaya taraka prayojana scheme, ap govt, corona

Tags:    

Similar News