వరద బాధితులకు రూ. 2వేల సాయం

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 2వేలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యల్లోపాల్గొంటూనే బాధితులను గుర్తించాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. […]

Update: 2020-08-18 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 2వేలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యల్లోపాల్గొంటూనే బాధితులను గుర్తించాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు.

ఇదిలాఉండగా, ఇవాళ సీఎం జగన్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్‌ కోరారు.

Tags:    

Similar News