'దిశ' ఎఫెక్ట్ : వలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దిశ, ఏపీ బ్యూరో: భవిష్యత్తుపై ఆందోళన పడుతూ.. సేవలందిస్తోన్న వలంటీర్లకు ప్రభుత్వం నగదు పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ నివురుగప్పిన నిప్పులా వలంటీర్లు’ శీర్షికతో వలంటీర్ల మౌన రోదనపై ‘దిశ’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కొన్ని నగదు అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ఏడాది పాటు సేవలందించిన వారికి సేవామిత్ర బ్యాడ్జీతోపాటు రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందజేస్తారు. మెరుగైన సేవలందించిన వలంటీర్లకు మండలం లేదా పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేస్తారు. వీరికి సేవారత్న బ్యాడ్జీతోపాటు […]
దిశ, ఏపీ బ్యూరో: భవిష్యత్తుపై ఆందోళన పడుతూ.. సేవలందిస్తోన్న వలంటీర్లకు ప్రభుత్వం నగదు పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ నివురుగప్పిన నిప్పులా వలంటీర్లు’ శీర్షికతో వలంటీర్ల మౌన రోదనపై ‘దిశ’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కొన్ని నగదు అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ఏడాది పాటు సేవలందించిన వారికి సేవామిత్ర బ్యాడ్జీతోపాటు రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
మెరుగైన సేవలందించిన వలంటీర్లకు మండలం లేదా పట్టణంలో ఐదుగుర్ని ఎంపిక చేస్తారు. వీరికి సేవారత్న బ్యాడ్జీతోపాటు రూ.20 వేల నగదు అందజేస్తారు. ఇక నియోజకవర్గ స్థాయిలో మెరుగైన సేవలందించిన ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్రాల పేరిట బ్యాడ్జీతోపాటు రూ.30 వేల నగదు అందిస్తారు. ఉగాది నుంచి ఈ అవార్డుల ప్రధానం ప్రతీ ఏటా కొనసాగుతుంది. తాము పడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన ‘దిశ’ పత్రికకు వలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు.