ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం.. వంగవీటి రాధాపై ఫోకస్ పెంచిన జగన్

దిశ, వెబ్ డెస్క్: వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో వంగ వీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తనను చంపాలని కొందరు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పాడు. దాంతో కొడాలి నాని సోమవారం సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితి వివరించారు. దాంతో స్పందించిన సీఎం వెంటనే 2+2 కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించారు. అలాగే రెక్కీ ఎవరు నిర్వహించారో తేల్చాలని ఇంటిలిజెన్స్ డీజీని కోరారు. రాధాకు ఎవరి మీదనైనా అనుమానాలు ఉంటే […]

Update: 2021-12-27 22:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో వంగ వీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తనను చంపాలని కొందరు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పాడు. దాంతో కొడాలి నాని సోమవారం సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితి వివరించారు. దాంతో స్పందించిన సీఎం వెంటనే 2+2 కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించారు. అలాగే రెక్కీ ఎవరు నిర్వహించారో తేల్చాలని ఇంటిలిజెన్స్ డీజీని కోరారు.

రాధాకు ఎవరి మీదనైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వానికి తెలపాలని, ప్రభుత్వం ఆయనకు అన్ని విధాల అండగా ఉంటుందని కొడాలి నాని ప్రెస్ మీట్ లో తెలిపారు. ఎవరికి ప్రాణ భయం ఉన్నా ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఎవరైనా రాధా పై ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల గురించి రాధాతో మాట్లాడలేదని తెలిపారు. గుడ్లవల్లేరు సభలో ప్రజల పిలుపుమేరకే తాను హాజరు అయినట్టు వివరించారు. పార్టీలోకి రాధా రావాలి అనుకుంటే అది ఆయనే చెబుతారని అన్నారు.

Tags:    

Similar News