రెండో విడత ‘జగనన్న తోడు’ పథకం.. రూ.10 వేలు అకౌంట్లో జమ
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రెండో విడత జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా రూ.10 వేలు వడ్డీ లేని రుణాన్ని జమ చేసినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా మొత్తం 3.7లక్షల మంది చిరు వ్యాపాలరుకు లబ్ది చేకూరనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రెండో విడత జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా రూ.10 వేలు వడ్డీ లేని రుణాన్ని జమ చేసినట్లు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా మొత్తం 3.7లక్షల మంది చిరు వ్యాపాలరుకు లబ్ది చేకూరనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో చిరు వ్యాపారుల వెతలను కళ్లారా చూసినట్లు జగన్ గుర్తుచేసుకున్నారు. అందుకోసమే బ్యాంకులతో మాట్లాడి చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. వడ్డీ భారం పూర్తిగా ప్రభుత్వానిదే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.