ఏపీలో రేపటి నుంచి లిక్కర్ అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి 45 రోజుల క్రితం మద్యం విక్రయాలకి మంగళం పాడిన కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయానికి లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఈ క్రమంలో మద్యం అమ్మకాలపై రాష్ట్రాలకు సూచనలిస్తూ… రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో మద్యం విక్రయాలు కొనసాగించ వచ్చని స్పష్టం చేస్తూ, రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ […]

Update: 2020-05-03 04:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి 45 రోజుల క్రితం మద్యం విక్రయాలకి మంగళం పాడిన కేంద్ర ప్రభుత్వం మద్యం విక్రయానికి లాక్‌డౌన్ ఎత్తివేసింది. ఈ క్రమంలో మద్యం అమ్మకాలపై రాష్ట్రాలకు సూచనలిస్తూ…

రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో మద్యం విక్రయాలు కొనసాగించ వచ్చని స్పష్టం చేస్తూ, రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసిన కేంద్రం, మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదని పేర్కొంది. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, ఏ దుకాణం వద్ద కూడా అయిదుగురికి మించి ఉండరాదని పేర్కొంది. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరిచేందుకు వీల్లేదని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ఉత్పత్తికి అనుమతించింది. దీంతో 45 రోజులుగా మూతపడిన డిస్టిలరీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. సుదీర్ఘ విరామంతో మద్యం అలవాటు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్ ఉధృతంగా సాగుతున్న తరుణంలోనే మద్యం షాపులు తెరవాలంటూ డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాలు తలొగ్గలేదు. ఇప్పటికి అనుమతులు లభించడంతో ఏపీలో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు జరుగుతాయని పలువురు అంచనావేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న 14 డిస్టిలరీలకు మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ఉత్తర్వులను వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను డిస్టిలరీలు పాటించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిమిత సంఖ్యలోనే సిబ్బంది విధులకు హాజరు కావాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి ఏపీ వాసులకు మద్యం అందుబాటులోకి రానుంది.

Tags: ap, corona effect, liquor, lockdown, permission to sale liquor,

Tags:    

Similar News