పాడి రైతులకు న్యాయం జరగాలి: సీఎం జగన్

దిశ, ఏపీ బ్యూరో: పాడి రైతులకు న్యాయం జరగాలని, వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. షుగర్‌ ఫ్యాక్టరీలు, డెయిరీల అభివృద్ధిపై సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పరిశ్రమను అభివృద్ధి చెయ్యడంతోపాటు అమూల్‌ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. […]

Update: 2020-06-26 11:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: పాడి రైతులకు న్యాయం జరగాలని, వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. షుగర్‌ ఫ్యాక్టరీలు, డెయిరీల అభివృద్ధిపై సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పాడి పరిశ్రమను అభివృద్ధి చెయ్యడంతోపాటు అమూల్‌ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వచ్చే నెల 15వ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకుంటామని సీఎంకు తెలిపారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ, పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి​ చేయాలని ఆదేశించారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదని సూచించారు. పాడి రంగంలో పునరుద్ధరించాల్సిన పరిశ్రమల వివరాలు సిద్ధం చేసి, చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతు బీమా పరిహారం చెల్లింపు ప్రభుత్వానిదే..

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పంటల బీమా పరిహారం చెల్లింపులకు రూ.596.36 కోట్లు విడుదల చేసినట్టు సీఎం తెలిపారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుందని అన్నారు. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా అమలు చేస్తామని అన్నారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలూ కల్పిస్తామనీ, ఈ కేంద్రాల్లోనే ఈ-క్రాపింగ్‌ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయంలోని అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఈ-క్రాపింగ్‌ రిజిస్టర్‌ నమోదు చేసి, వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ఇందుకు రైతులు కేవలం ఒక్క రూపాయి కడితే సరిపోతుందని సూచించారు. ఆ తరువాతి నుంచి రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని, బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా, పంటల బీమాను ఈ-క్రాప్‌తో‌ అనుసంధానించడం ద్వారా 2019 ఖరీఫ్‌ సీజన్‌లో 25.73 లక్షల మందికి, 2020లో రబీలో 33.03 లక్షల మందికి 58.76 లక్షల మందికి ఉచిత పంటల బీమా సౌకర్యం అందనుందని సీఎం వెల్లడించారు.

వైఎస్సార్ యాప్ ఆరంభం

రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేసేందుకు సీఎం జగన్ వైఎస్సార్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్‌ను రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్‌బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిపై సకాలంలో రిపోర్ట్ చేయడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌లను తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
వ్యవసాయం రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పాటు ఈ-క్రాప్ విధానం, పొలంబడి కార్యక్రమాలు, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, ఇన్‌పుట్స్ పంపిణీలకు సబంధించిన అన్ని వివరాలను ఈ యాప్‌ ద్వారా అందిస్తారు. వాటిని యాప్‌లో నమోదు చేస్తారు. అలా ఆర్‌బీకే సిబ్బంది నమోదు చేసిన డేటాను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

Tags:    

Similar News