మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. గత మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని భావించి, దాని కోసం ఏర్పాట్లు సైతం చేసింది. అయితే ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేస్తూ, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.
గత మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని భావించి, దాని కోసం ఏర్పాట్లు సైతం చేసింది. అయితే ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడంతో రాష్ర్టంలో పెద్ద ఎత్తున వివాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టం అవుతోంది.