టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రీన్‌సిగ్నల్
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి సమీపంలోని వడమాలపేట వద్ద 300 ఎకరాల భూమిని గుర్తించారు. బుధవారం తిరుపతి పద్మావతి రెస్ట్‌హౌస్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే త్వరలో కేబినెట్ ఆమోదిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. తద్వారా ఆరు వేల మంది […]
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి సమీపంలోని వడమాలపేట వద్ద 300 ఎకరాల భూమిని గుర్తించారు. బుధవారం తిరుపతి పద్మావతి రెస్ట్‌హౌస్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే త్వరలో కేబినెట్ ఆమోదిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. తద్వారా ఆరు వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. త్వరలో ఉద్యోగుల హెల్త్పాలసీకి సంబంధించి క్యాష్‌లెస్ ట్రీట్ మెంట్ కు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న దాదాపు 15 వేల మంది కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ కార్పొరేషన్లో కలపబోవడం లేదని స్పష్టం చేశారు. టీటీడీ కిందనే వారి సేవలను పరిగణిస్తామని ప్రకటించారు.