గౌతం సవాంగ్‌ మీరు షాడో కాదు- డీజీపీపై లోకేశ్ ఫైర్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూపించడంలో రాంగోపాల్ వర్మను మించిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్న జగన్‌ను వదిలేసి, విపక్షాలపై ఏడుస్తారెందుకంటూ […]

Update: 2021-09-04 09:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూపించడంలో రాంగోపాల్ వర్మను మించిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు.

డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్న జగన్‌ను వదిలేసి, విపక్షాలపై ఏడుస్తారెందుకంటూ ఘాటు విమర్శలు చేశారు. స్వప్రయోజనాల కోసం ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను తాడేపల్లి ప్యాలెస్‌కు తాకట్టు పెట్టడం మీ కెరీర్‌లో మాయనిమచ్చలా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు.

వైసీపీ అరాచకాలపై చర్యలేవి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్షతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై వచ్చిన ఆరోపణలను గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేసిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

జగన్ ఇంటి పక్కనే అత్యాచార ఘటన జరిగి నెలలు గడుస్తుంటే పూర్తి స్థాయిలో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని నిలదీశారు. మంత్రులు, శాసనసభ్యుల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే నీళ్లు నములుతారేంటి? అంటూ లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ‘మీరు షాడో హోంమంత్రి సజ్జల వద్ద పనిచేస్తున్న గుమాస్తా కాదు.. రాష్ట్ర డీజీపీ అని గుర్తుంచుకోండి. దిశ చట్టం ఇంకా చట్టబద్ధం కాలేదని సీఎంకు, మంత్రులకు అవగాహన కల్పించండి. వారంతా నిందితులకు ఉరిశిక్ష వేసేశాం అని పగటి కలలు కంటున్నారు’ అంటూ ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News