AP Health bulletin : సెంచరీ దాటిన కరోనా మరణాలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు రోజువారీగా తగ్గుతూ వస్తు్న్నాయి. ఆంధ్రాతో సరిహద్దు పంచుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుండగా, ఆ రాష్ట్రంలో మాత్రం పాక్షిక నిర్భందం అమలవుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది మృతి చెందారు. కొత్త కేసులు కలుపుకుని ఏపీలో […]

Update: 2021-05-27 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు రోజువారీగా తగ్గుతూ వస్తు్న్నాయి. ఆంధ్రాతో సరిహద్దు పంచుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుండగా, ఆ రాష్ట్రంలో మాత్రం పాక్షిక నిర్భందం అమలవుతోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు వెలుగుచూడగా, 104 మంది మృతి చెందారు. కొత్త కేసులు కలుపుకుని ఏపీలో ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 10,531 కొవిడ్ మరణాలు సంభవించాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనాతో 14 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

 

Tags:    

Similar News