కరోనాలో తెలంగాణను మించిన ఏపీ.. కరోనా @ 1016

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటేసింది. పదులు సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కరోనా టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని ప్రకటనలు కూడా చేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయని కూడా అంటున్నారు. గణాంకాలు మాత్రం ఆందోళన చెందేస్థాయలో నమోదవుతున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం […]

Update: 2020-04-25 01:52 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటేసింది. పదులు సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులతో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కరోనా టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని ప్రకటనలు కూడా చేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయని కూడా అంటున్నారు. గణాంకాలు మాత్రం ఆందోళన చెందేస్థాయలో నమోదవుతున్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం 1,016 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 25, కర్నూలులో 14, గుంటూరులో 3, అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3 కేసులు నమోదయ్యాయని ప్రకటించింది.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 275 కేసులు నమోదయ్యాయని చెప్పింది. ఆ తరువాతి స్థానంలో గుంటూరు జిల్లా కొనసాగుతోందని, ఆ జిల్లాలో 209 కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడించింది. ఆ తరువాతి స్థానంలోకి కృష్ణా జిల్లా 25 కేసులతో దూసుకొచ్చింది. దీంతో 127 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో చిత్తూరు 73, కడప 55, ప్రకాశం 53, అనంతపురం 51, పశ్చిమగోదావరి 39, తూర్పుగోదావరి 37, విశాఖపట్టణం 22, శ్రీకాకుళం జిల్లాలో తాజాగా నమోదైన మూడు కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరుకుంది.

నిన్న కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. 171 మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags: corona virus, covid-19, andhrapradesh, health department

Tags:    

Similar News