ఏపీ కేబినెట్ భేటీ @ జూన్ 11

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై నివేదికలు పంపాలని అన్నిశాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా కేసుల ఉధృతిపై చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రానికి […]

Update: 2020-06-03 06:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై నివేదికలు పంపాలని అన్నిశాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా కేసుల ఉధృతిపై చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News