సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది: కన్నా
ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ ఛీప్ కన్నా లక్ష్మినారాయణ ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు కేంద్రం అందిస్తున్న రూ.1000 సాయాన్ని వైసీపీ ప్రభుత్వం తాము ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు. దేశం కష్టకాలంలో ఉంటే కేంద్రం ఇచ్చే సహాయానికి వైసీపీ స్టిక్కర్లు వేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వాలంటీర్లతో కలసి వైసీపీ కార్యకర్తలు చాలా చోట్ల […]
ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ ఛీప్ కన్నా లక్ష్మినారాయణ ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు కేంద్రం అందిస్తున్న రూ.1000 సాయాన్ని వైసీపీ ప్రభుత్వం తాము ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు. దేశం కష్టకాలంలో ఉంటే కేంద్రం ఇచ్చే సహాయానికి వైసీపీ స్టిక్కర్లు వేయటం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వాలంటీర్లతో కలసి వైసీపీ కార్యకర్తలు చాలా చోట్ల ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags: bjp chief kanna, ap govt, ap news