ఢిల్లీలోని ఏపీ భవన్ మూసివేత
దిశ, న్యూస్ బ్యూరో: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆయనను కంటోన్మెంట్ పరిధిలోని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన వెంటనే భవన్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌తో భవనాన్ని, పరిసరాలను శుభ్రం చేశారు. మూడు రోజుల పాటు ఆఫీసుకు రావద్దని సిబ్బందికి సర్క్యులర్ జారీ అయింది. ఎలాగూ ఆదివారం సెలవు కావడంతో మంగళవారం వరకూ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. ఈ కార్యాలయం పై అంతస్తులోనే ఉంటున్న తెలంగాణ భవన్ […]
దిశ, న్యూస్ బ్యూరో: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆయనను కంటోన్మెంట్ పరిధిలోని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన వెంటనే భవన్ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌తో భవనాన్ని, పరిసరాలను శుభ్రం చేశారు. మూడు రోజుల పాటు ఆఫీసుకు రావద్దని సిబ్బందికి సర్క్యులర్ జారీ అయింది. ఎలాగూ ఆదివారం సెలవు కావడంతో మంగళవారం వరకూ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. ఈ కార్యాలయం పై అంతస్తులోనే ఉంటున్న తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. తెలంగాణ ఆర్సీ కార్యాలయ సిబ్బంది సైతం మంగళవారం వరకు ఆఫీసుకు వెళ్ళడం సాధ్యం కాదు. రెండు వేర్వేరు రాష్ట్రాలు అయినప్పటికీ కార్యాలయాలు మాత్రం ఒకే భవనంలో వేర్వేరు అంతస్తుల్లో పనిచేస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ అధికారికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎంఓ అధికారి ఒకరికి ఆందోళన పట్టుకుంది. ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అధికారితో రెండు రోజుల క్రితమే ఢిల్లీలో సమీక్ష నిర్వహించి విజయవాడకు చేరుకున్నారు. ప్రస్తుతం సీఎంఓ కార్యాలయంతో పాటు మరో శాఖకు ముఖ్య అధికారిగా కూడా పనిచేస్తున్నారు. ఢిల్లీకి సమీక్ష కోసం వెళ్ళి కరోనా వైరస్‌ను మోసుకొచ్చినట్లయింది. ఇదే సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన ఢిల్లీలో పనిచేస్తున్న మరో మహిళా అధికారి కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వీరంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఈ సమావేశంతో ప్రత్యక్షంగా సంబంధం కలిగినవారంతా అనివార్యంగా హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది.
గత నెలలో పాత్రికేయులకు కరోనా పాజిటివ్ రావడంతో మీడియా సెంటర్ మూతపడింది. ఇప్పుడు ఏకంగా ఆర్సీ కార్యాలయాలే మూతపడ్డాయి. అసలుకే ఢిల్లీలో వైరస్ విస్తృతంగా ఉందన్న ఆందోళనతో ఉన్న ఉద్యోగులు కేవలం ఆఫీసుకు, అక్కడే ఉన్న క్వార్టర్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆఫీసు సిబ్బందికి కూడా రావడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొనింది.