‘ఏపీలో ఎన్నార్సీని అమలు చేయబోం’

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2020-21తో పాటు, ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌కి అనుమతించలేమని శాసనసభ తీర్మానించింది. మధ్యాహ్న భోజన విరామానంతరం సభలో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు సీఎంతో పాటు శాసనసభ్యులు […]

Update: 2020-06-17 06:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2020-21తో పాటు, ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్‌సీఆర్, ఎన్‌పీఆర్‌కి అనుమతించలేమని శాసనసభ తీర్మానించింది. మధ్యాహ్న భోజన విరామానంతరం సభలో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు సీఎంతో పాటు శాసనసభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు ప్రకటించి, సభను స్పీకర్ తమ్మినేని సీతారాం నిరవధిక వాయిదా వేశారు.

Tags:    

Similar News