మెగాస్టార్ ఆచార్యలో స్వీటి?

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయిపోయింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మధ్య దాదాపుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న స్వీటి.. మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల చిరు 152వ చిత్రం ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకోవడంతో.. ఆ ప్లేస్‌ను స్వీటి భర్తీ చేయనుందని తెలుస్తోంది. ‘స్టాలిన్’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో చిరుతో స్టెప్పులేసిన ఈ భామ… ఇప్పుడు చిరుకు జంటగా […]

Update: 2020-03-16 00:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయిపోయింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మధ్య దాదాపుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న స్వీటి.. మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల చిరు 152వ చిత్రం ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకోవడంతో.. ఆ ప్లేస్‌ను స్వీటి భర్తీ చేయనుందని తెలుస్తోంది. ‘స్టాలిన్’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో చిరుతో స్టెప్పులేసిన ఈ భామ… ఇప్పుడు చిరుకు జంటగా కనిపించబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.

అయితే త్రిష ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక … ‘ఖైదీ నం. 150’లో చిరుతో జోడి కట్టిన కాజల్ అగర్వాల్‌ను ‘ఆచార్య’ సినిమాలోనూ తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ కాజల్‌కు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో.. అనుష్కను హీరోయిన్‌గా ఫైనల్ చేసే అవకాశముందని సమాచారం. పైగా ఈ పాత్రకు అనుష్కను తీసుకుంటే పూర్తిగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట డైరెక్టర్ కొరటాల శివ. సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించబోతున్న ‘ఆచార్య’ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత.

Tags:    

Similar News