సెక్సువల్ ఫ్రీడమ్ @మిడ్‌నైట్

దిశ, వెబ్‌డెస్క్: ‘ఎత్తయిన కొండ.. చల్లని గాలి.. చిన్న టెంట్.. అందులో లాంతరు.. అపరిచిత వ్యక్తితో శృంగారం..’ ఇది ఓ భార్య, భర్తకు చెప్పే తన ఫాంటసీ. కానీ తన వైఫ్ ఇలాంటి ఫాంటసీలో మునిగి తేలుతోందని తెలుసుకున్న ఆ భర్త ఎలా రియాక్ట్ అవుతాడు? అఫ్‌కోర్స్.. భార్య మీద మండిపడతాడు. ఏ.. నేను నిన్ను శాటిస్‌ఫై చేయట్లేదా? అందుకోసం మరో వ్యక్తి కావాల్సి వచ్చాడా? అది కూడా అపరిచితుడు.. అంటూ ఎడాపెడా వాయించేస్తాడు. ఇంతకీ అప్పుడు […]

Update: 2021-01-10 02:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఎత్తయిన కొండ.. చల్లని గాలి.. చిన్న టెంట్.. అందులో లాంతరు.. అపరిచిత వ్యక్తితో శృంగారం..’ ఇది ఓ భార్య, భర్తకు చెప్పే తన ఫాంటసీ. కానీ తన వైఫ్ ఇలాంటి ఫాంటసీలో మునిగి తేలుతోందని తెలుసుకున్న ఆ భర్త ఎలా రియాక్ట్ అవుతాడు? అఫ్‌కోర్స్.. భార్య మీద మండిపడతాడు. ఏ.. నేను నిన్ను శాటిస్‌ఫై చేయట్లేదా? అందుకోసం మరో వ్యక్తి కావాల్సి వచ్చాడా? అది కూడా అపరిచితుడు.. అంటూ ఎడాపెడా వాయించేస్తాడు. ఇంతకీ అప్పుడు ఏం జరుగుతుంది? అసలు భార్య ఎందుకు అలాంటి ఫాంటసీ గురించి చెప్పింది? అనేదే మలయాళం షార్ట్ ఫిల్మ్ ‘ఫ్రీడమ్@ మిడ్‌నైట్’ కథ కాగా.. బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ షార్ట్ ఫాంటసీకి ఆడియన్స్ నుంచి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.

కథ:

ఏ భార్య అయినా.. తన భర్త మరో అమ్మాయిని చూస్తున్నాడంటేనే ఒప్పుకోదు. కానీ రాత్రి తన పక్కనే నిద్రిస్తున్నట్లు నటిస్తూ, మోసం చేస్తూ మరో అమ్మాయితో సెక్సువల్ చాట్ చేస్తున్నాడని తెలిస్తే ఎంతగా ఫీల్ అవుతుంది. ఆఫీస్‌ కొలీగ్‌తో సెక్సువల్ ఫ్రీడమ్‌ కోరుకుంటున్నాడు? అని తెలిస్తే ఎంతలా కుమిలిపోతుంది. ఆఫీస్ పనులతో హజ్బెండ్ బిజీగా ఉన్నాడని, ఇంట్లో అన్ని పనులను చక్కబెట్టే వైఫ్.. తనను కాదని మరో అమ్మాయి దగ్గరకు వెళ్తున్నాడు అంటే కాళికాదేవి అవతారం ఎత్తుతుందా? లేదా? అచ్చం అలాంటి కథే.. ‘ఫ్రీడమ్@ మిడ్‌నైట్’.

ఇక కథ విషయానికి వస్తే.. భర్త సెక్సువల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నాడని, ‘బేబీ’ అంటూ మరో అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకున్న భార్య చంద్ర(అనుపమ పరమేశ్వరన్).. రివర్స్ గేర్‌లో వచ్చి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తనకు అపరిచిత వ్యక్తితో శృంగారం చేయాలని ఉందంటూ భర్తకు వివరిస్తుంది. అసలు తను బయటకు ఎప్పుడు వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? ఇంట్లో ఏమేం పనులు చక్కదిద్దుతుంది.. ఇంట్లో వారందరికోసం ఎంత కష్టపడుతుంది? ఫ్యామిలీ కోసం ఎంతగా శాక్రిఫైజ్ చేస్తుంది? అనే విషయాలను పట్టించుకోని భర్త.. ‘సెక్స్ విత్ అన్ నోన్ పర్సన్’ అని భార్య చెప్పగానే ఫైర్ అయిపోతాడు. ఎవడువాడు.. మనింటికి వచ్చే నా ఫ్రెండ్స్‌లో ఎవరిమీదైనా మోజుపడ్డావా? అంటూ ప్రశ్నలతో వేధిస్తూ మాటలతో హింసిస్తాడు. అప్పుడు ప్రశ్నిస్తుంది భార్య.. ‘నేను అపరిచిత వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంటాను అంటేనే ఇంత ఫైర్ అవుతున్న నువ్వు.. మరో అమ్మాయితో ఎందుకు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నావు’ అని. ఎందుకింత చీట్ చేశావ్? అని. అప్పుడు భర్త నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది. ఇంతకీ భార్య చెప్పిన అపరిచిత వ్యక్తితో శృంగారం కాన్సెప్ట్‌కు ఓకే చెప్పాడా? లేక తనే తప్పుడు ఫాంటసీలో బతుకుతున్నానని రియలైజ్ అయ్యాడా?

ఆడియన్స్ రెస్పాన్స్:

‘మిలియన్ మెన్ అండ్ ఉమెన్’ బేస్ చేసుకుని షార్ట్ ఫిల్మ్ చేశామని చెప్పిన ‘ఫ్రీడమ్@ మిడ్‌నైట్’ మేకర్స్.. అద్భుతమైన లఘు చిత్రాన్ని అందించారని ప్రశంసించారు. నేటి కాలానికి తగినట్లుగా, సందర్భోచితంగా ఉన్న షార్ట్ ఫిల్మ్‌లో వర్చువల్ రిలేషన్స్‌తో భార్యాభర్తల మధ్య జరుగుతున్న అంతర్మథనాన్ని చూపించారని.. అనుపమ పరమేశ్వరన్, హకీం షాజహాన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాన్సెప్ట్, కథను ప్రజెంట్ చేసిన తీరుపై డైరెక్టర్ ఆర్‌జే షాన్‌‌ను కొనియాడుతున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News