నగరంలో నేడు 4,134 మందికి యాంటిజెన్ టెస్టులు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గత 12 రోజులుగా నగరంలోని యూపీహెచ్సీల్లో చేపడుతున్న పరీక్షల్లో ఇప్పటి వరకు 25,069 మందికి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. వీరిలో 4,166 మందికి పాజిటివ్, 20,903 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. మొత్తం కేసుల్లో శనివారం ఒక్క రోజే జిల్లాలోని 97 యూపీహెచ్సీ లు, బస్తీ దవాఖానల్లో 4,134 మందికి యాంటిజెన్ పరీక్షలు చేయగా 698 […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గత 12 రోజులుగా నగరంలోని యూపీహెచ్సీల్లో చేపడుతున్న పరీక్షల్లో ఇప్పటి వరకు 25,069 మందికి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. వీరిలో 4,166 మందికి పాజిటివ్, 20,903 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. మొత్తం కేసుల్లో శనివారం ఒక్క రోజే జిల్లాలోని 97 యూపీహెచ్సీ లు, బస్తీ దవాఖానల్లో 4,134 మందికి యాంటిజెన్ పరీక్షలు చేయగా 698 మందికి పాజిటివ్, 3,436 మందికి నెగిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.