అంతయ్య మృతదేహం లభ్యం… వారం రోజుల తర్వాత వెలికితీత
దిశ, ఎల్బీనగర్: వనస్థలిపురం సాహెబ్‌నగర్ పద్మావతినగర్ కాలనీలోని డ్రైనేజీలో గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు అంతయ్య మృతదేహం వారం రోజుల తర్వాత లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు ఈ నెల 3వ తేది మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా అదే రోజు శివ మృతదేహాన్ని బయటకు తీయగా.. అంతయ్య గల్లంతయ్యాడు. 7 రోజులుగా అంతయ్య మృతదేహం కోసం గాలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది అనంత వేణునగర్ చౌరస్తావద్ద 800ఎంఎం సివర్ ట్రంక్ […]
దిశ, ఎల్బీనగర్: వనస్థలిపురం సాహెబ్‌నగర్ పద్మావతినగర్ కాలనీలోని డ్రైనేజీలో గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు అంతయ్య మృతదేహం వారం రోజుల తర్వాత లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు ఈ నెల 3వ తేది మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా అదే రోజు శివ మృతదేహాన్ని బయటకు తీయగా.. అంతయ్య గల్లంతయ్యాడు. 7 రోజులుగా అంతయ్య మృతదేహం కోసం గాలిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది అనంత వేణునగర్ చౌరస్తావద్ద 800ఎంఎం సివర్ ట్రంక్ పైప్‌లైన్‌లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు.
కోయంబత్తూర్ టెక్నాలజీ సహయంతో ఓ కెమెరాను సివర్ ట్రంక్ పైప్‌లోకి పంపి మృతదేహాన్ని గుర్తించారు. అక్కడికి చేరుకున్న మృతుడి కుటుంబసభ్యులు మృతదేహం అంతయ్యదే అని నిర్థారించారు. అంతయ్య ఆచూకీ కోసం అధికారులు డ్రోన్ కెమెరాలు, 200 మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని, 4 రెస్క్యూ టీంలు, ఎంటమాలజీ, ఇంజనీరింగ్ సిబ్బందిని ఉపయోగించారు.