ఖమ్మంలో మరో రెండు పాజిటివ్ కేసులు
ఖమ్మం: జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ ఆర్.వి కర్ణన్ వెల్లడించారు. వీరిలో ఒకరు మోతినగర్‌కు చెందిన వ్యక్తి కాగా, ఈయన తొలిసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పెద్దతండాలోని గిరిజన నాయకుడితో సన్నిహితంగా మెలిగారు. మరొకరు ఖిల్లా ప్రాంతానికి చెందిన మహిళ కాగా, ఈమె రెండో పాజిటివ్ వ్యక్తికి కోడలు. బాధితులను వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు కలెక్టర్ వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ఖమ్మంలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు […]
ఖమ్మం: జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ ఆర్.వి కర్ణన్ వెల్లడించారు. వీరిలో ఒకరు మోతినగర్‌కు చెందిన వ్యక్తి కాగా, ఈయన తొలిసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పెద్దతండాలోని గిరిజన నాయకుడితో సన్నిహితంగా మెలిగారు. మరొకరు ఖిల్లా ప్రాంతానికి చెందిన మహిళ కాగా, ఈమె రెండో పాజిటివ్ వ్యక్తికి కోడలు. బాధితులను వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు కలెక్టర్ వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ఖమ్మంలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరిందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాలైన పెద్దతండా, ఖిల్లా, మోతినగర్‌లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
లాక్ డౌన్ మరింత కఠినం..
పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు సీపీ తప్సిర్ ఇక్బాల్ వెల్లడించారు. శనివారం నుంచి ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు గస్తీ కాస్తారనీ, ఉదయం 11గంటలు దాటిన తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కాగా, నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 84 వాహనాలు సీజ్ చేయగా, 34 మందిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
Tags: corona cases in khammam, khammam, corona positive, collector R.V karnan, CP thapsir iqbal,