పాక్‌లో మాలిక్ బ్రదర్స్ ట్రైనింగ్.. దర్బంగా బ్లాస్ట్‌లో మరో ట్విస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : దర్బంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే లోతుగా విచారణను చేపట్టింది. ఈ క్రమంలో దర్బంగా పేలుళ్ల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మాలిక్ సోదరుల అరెస్ట్ తర్వాత వారి తండ్రి మూసాఖాన్ స్పందించారు. ఈ క్రమంలో మాలిక్ సోదరులు.. తాము ఇండియన్ ‘రా’(RAW.. Research and Analysis Wing) ఏంజెట్స్‌మని కుటుంబ సభ్యులను నమ్మించారని తెలిపారు. అయితే, వారు తరచూ ఫోన్‌లో […]

Update: 2021-07-03 23:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దర్బంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే లోతుగా విచారణను చేపట్టింది. ఈ క్రమంలో దర్బంగా పేలుళ్ల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మాలిక్ సోదరుల అరెస్ట్ తర్వాత వారి తండ్రి మూసాఖాన్ స్పందించారు. ఈ క్రమంలో మాలిక్ సోదరులు.. తాము ఇండియన్ ‘రా’(RAW.. Research and Analysis Wing) ఏంజెట్స్‌మని కుటుంబ సభ్యులను నమ్మించారని తెలిపారు.

అయితే, వారు తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వారిని ఆరా తీసినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాలిక్ బ్రదర్స్ ‘రా’లో తమకు ఆఫీసర్ టాస్క్ ఇచ్చారని కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే, కుటుంబ సభ్యులు బురిడీ కొట్టించి మాలిక్ బ్రదర్స్ ఉగ్ర కార్యాచరణను చేపట్టిన తెలుస్తోంది. 2012లో మాలిక్ బ్రదర్స్ ‘రా’ పనిపై పాక్ వెళ్లినట్టు కుటుంబ సభ్యులను నమ్మించారు.

ఆ సమయంలో పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద మాలిక్ బ్రదర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. 2012లోనే 4 నెలలపాటు పాకిస్తాన్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం 2016లోనూ మాలిక్ సోదరులు దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలో ఐఈడీ అమర్చడంలో నాసిర్ మాలిక్ స్పెషలిస్టుగా తయారైనట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News