నోరు జారిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఏం అన్నారంటే.?

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒక విషయంలో వారు వార్తల్లోకి రావడం పరిపాటిగా మారింది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడి.. పొరపాటును గుర్తించి నాలుక కరుచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సిందిపోయి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. దీంతో పక్కనున్నవాళ్లు గుర్తించి చెప్పడంతో మాట సరిచేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ […]

Update: 2021-08-26 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒక విషయంలో వారు వార్తల్లోకి రావడం పరిపాటిగా మారింది.

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడి.. పొరపాటును గుర్తించి నాలుక కరుచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సిందిపోయి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. దీంతో పక్కనున్నవాళ్లు గుర్తించి చెప్పడంతో మాట సరిచేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకల్లో ఈ ఘటన జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన తడబడ్డారు. ఈ క్రమంలో పక్కన వాళ్లు తప్పును గుర్తించడంతో మళ్లీ తేరుకున్నారు.

Tags:    

Similar News