ఆ దేశంలో మరో వింత వ్యాధి.. లక్షణాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: ఒక పక్క కరోనా ప్రపంచాన్ని గజగజ లాడిస్తోంది.. ఇంకా దీని ఉధృతి తగ్గనే లేదు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బ్లాక్, వైట్, ఎల్లో, క్రీం ఫంగస్ లు అంటూ వింత వింత వ్యాధులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక వీటితోనే జనాలు భయపడి చస్తుంటే మరో వింత వ్యాధి కేంద్ర ప్రజలను వణికిస్తోంది. ఇటీవలే కరోనా నుండి పూర్తిగా కోలుకున్న కెనడా దేశం మరో వింత వ్యాధితో సతమతమవుతోంది. ఇటీవల ఒక […]
దిశ, వెబ్‌డెస్క్: ఒక పక్క కరోనా ప్రపంచాన్ని గజగజ లాడిస్తోంది.. ఇంకా దీని ఉధృతి తగ్గనే లేదు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బ్లాక్, వైట్, ఎల్లో, క్రీం ఫంగస్ లు అంటూ వింత వింత వ్యాధులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక వీటితోనే జనాలు భయపడి చస్తుంటే మరో వింత వ్యాధి కేంద్ర ప్రజలను వణికిస్తోంది. ఇటీవలే కరోనా నుండి పూర్తిగా కోలుకున్న కెనడా దేశం మరో వింత వ్యాధితో సతమతమవుతోంది. ఇటీవల ఒక ఆసుపత్రిలో పలువురు ఒకే లక్షణాలు కలిగి ఉండడాన్ని ఆసుపత్రి వర్గాలు గమనించాయి.
నిద్రలేమి, కండరాల బలహీనత, ఆందోళన, పీడకలలు వంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య కెనడాలో పెరుగుతోంది. ముఖ్యంగా న్యూబ్రన్స్ వీక్ ప్రావిన్స్ లో ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నవారే ఎక్కువట. ఇక ఇవన్నీ ఆ వ్యాధికి సంబందించిన లక్షణాలే అని వైద్యులు తెలుపుతున్నారు. కానీ ఈ వ్యాధి ఎందుకు వస్తోంది.. దీనికి నివారణ మార్గాలు ఉన్నాయా..? అనే దిశగా వైద్యులు విచారిస్తున్నారు. ఈ వ్యాధికి కారణం.. ఫోన్ అధికంగా వినియోగించడం అని కొందరు చెబుతుంటే మరికొందరు మాత్రం కరోనా వ్యాక్సిన్ కారణంగా ఇలా జరుగుతుందని చెబుతున్నారు.