సెబీ కార్యాలయంలో కరోనా ఆందోళన!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లో కరోనా భయాలు మొదలయ్యాయి. సెబీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్టు ధృవీకరణ కావడంతో సంస్థలో ఆందోళన మొదలైంది. దీంతో సెబీ ముఖ్య కార్యాలయాన్ని తాత్కాలికంగా ఎన్‌సీఎల్ బిల్డింగ్‌లోకి తరలించినట్టు, ప్రస్తుత కార్యాలయం ఉన్న కాంప్లెక్స్‌లోని భవనాలను పూర్తి శానిటైజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మే 7న సెబీలో ఉన్న ఒకరికి కరోనా పాజిటివ్ రావడం, […]
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లో కరోనా భయాలు మొదలయ్యాయి. సెబీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకినట్టు ధృవీకరణ కావడంతో సంస్థలో ఆందోళన మొదలైంది. దీంతో సెబీ ముఖ్య కార్యాలయాన్ని తాత్కాలికంగా ఎన్‌సీఎల్ బిల్డింగ్‌లోకి తరలించినట్టు, ప్రస్తుత కార్యాలయం ఉన్న కాంప్లెక్స్‌లోని భవనాలను పూర్తి శానిటైజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మే 7న సెబీలో ఉన్న ఒకరికి కరోనా పాజిటివ్ రావడం, ఆ భవనాన్ని పూర్తి శానిటైజ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు రెండో కేసు వార్తలతో తాత్కాలికంగా కార్యాలయాన్ని తరలించనున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు మొదలైనప్పటి నుంచి సెబీ సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మార్కెట్లు పనిచేసే సమయంలో కూడా సెబీ నిర్విరామంగా పనిచేసిందని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయంలో సంస్థలోని ఉద్యోగులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తున్నట్టు చెబుతున్నారు.