మంత్రి మల్లారెడ్డికి మరో ఎదురుదెబ్బ

దిశ, మేడ్చల్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామ సమస్యలపై చర్చించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అవడంతో గ్రామ అభివృద్ధికి మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సహకరించడం లేదని ప్రజల ఆరోపించారు. గౌడవెళ్లి గ్రామసభ అధికార పార్టీ మీటింగ్‌గా మారిందని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం […]

Update: 2021-07-05 06:05 GMT

దిశ, మేడ్చల్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామ సమస్యలపై చర్చించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అవడంతో గ్రామ అభివృద్ధికి మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సహకరించడం లేదని ప్రజల ఆరోపించారు. గౌడవెళ్లి గ్రామసభ అధికార పార్టీ మీటింగ్‌గా మారిందని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో అన్ని సమస్యలు తీరవని మంత్రి అనడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు అన్నారు. మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి నివేదికను సర్పంచ్ తన వద్ద చర్చించమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

ఎల్లంపేట్ గ్రామంలో

మండలంలోని ఎల్లంపేట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లంపేట పాలక వర్గం సగం మంది కూడా హాజరవకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లంపేట్ గ్రామంలో మొత్తం 10 వార్డ్ మెంబర్లు ఉండగా ఇద్దరు వార్డ్ మెంబర్లు మాత్రమే హజారయ్యారు మిగితా వారు హాజరవకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించే వేదికను పక్కన పెట్టి రాజకీయాలు చేయడం తగదని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. వార్డ్ మెంబర్లును ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా ఎల్లంపేట్ సర్పంచ్ ఒంటెద్దు పోకడలకు పోయి గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం మంత్రి పర్యటనపై కూడా సమాచారం అందించలేదని వారు వాపోతున్నారు.

Tags:    

Similar News