తెలంగాణకు మరో రికార్డ్.. ఆ పనిలో దేశంలోనే ఫస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో : ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో అమలు చేస్తున్న నూతన ఆన్ లైన్ ఆడిట్ విధానంలో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు గాను 3,636 గ్రామపంచాయతీలను ఆన్‌లైన్లో ఆడిట్ చేసింది. ఆ ఆడిట్ నివేదికలను గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పంపింది. రాష్ట్రంలో ఆన్ లైన్ ఆడిట్‌ని జూన్ మాసం నుంచి ప్రణాళిక ప్రకారం అమలు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఆడిట్ శాఖ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో అమలు చేస్తున్న నూతన ఆన్ లైన్ ఆడిట్ విధానంలో రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు గాను 3,636 గ్రామపంచాయతీలను ఆన్‌లైన్లో ఆడిట్ చేసింది. ఆ ఆడిట్ నివేదికలను గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పంపింది.
రాష్ట్రంలో ఆన్ లైన్ ఆడిట్‌ని జూన్ మాసం నుంచి ప్రణాళిక ప్రకారం అమలు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఆడిట్ శాఖ ముందుంది. నూరు శాతం ఆన్ లైన్‌లో గ్రామపంచాయతీలు ఆడిట్ చేసేలా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ చర్యలు తీసుకున్నా కొన్ని రాష్ట్రాలు నేటికీ పాటించడం లేదు. ఇప్పటికే ఆన్ లైన్ ఆడిట్‌లో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. తెలంగాణ ఆడిట్ శాఖ మాత్రం కేంద్రం తీసుకున్న నూరుశాతం ఆన్‌లైన్ ఆడిట్ విధానాన్ని అమలు చేస్తోంది. గ్రామ పంచాయతీలను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయడంతో కేంద్రం, రాష్ట్రాల నిధులు గ్రామ పంచాయతీల్లో ఎలా ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అయితే కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే ఆన్ లైన్ ఆడిట్‌ని ప్రారంభించాయి. గతేడాది తెలంగాణలో 12,769 గ్రామపంచాయతీలకు 5,174 గ్రామపంచాయతీలను ఆన్ లైన్‌లో ఆడిట్ చేసి నివేదికలను, 56,505 అభ్యంతరాలని ఆడిట్ శాఖ అందించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిరంతర పర్యవేక్షణలో, తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వర రావు యాక్షన్ ప్లాన్ తయారు చేయించి అమలుకు శ్రీకారం చుట్టారు. దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ 443 గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ ఆడిట్ పూర్తి చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో 236 గ్రామ పంచాయతీలు, రాజస్థాన్‌లో 144 గ్రామ పంచాయతీలు, కర్ణాటకలో 106 గ్రామ పంచాయతీలను ఆన్ లైన్ ఆడిట్ చేశారు.