నల్లగొండలో తాజాగా మరో కేసు
దిశ, నల్లగొండ: జిల్లాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పట్టణంలోని ఓ కాలనీలో తాజాగా కేసు వెలుగులోకి వచ్చింది. బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు. సదరు యువకుడి తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో 12 రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్‌లో చేరిపించారు. తండ్రికి సేవలు చేస్తున్న క్రమంలో.. యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం […]
దిశ, నల్లగొండ: జిల్లాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పట్టణంలోని ఓ కాలనీలో తాజాగా కేసు వెలుగులోకి వచ్చింది. బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు. సదరు యువకుడి తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో 12 రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్‌లో చేరిపించారు. తండ్రికి సేవలు చేస్తున్న క్రమంలో.. యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కన్పించడంతో వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అతడి తండ్రిని వెంటనే ఐసీయూ వార్డు నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చారు. అతని కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు నల్గొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు. తాజా కేసుతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. అలాగే మరో 10 మంది వలస కార్మికులు సైతం వైరస్ బారినపడ్డారు. ఈ వారంలోనే జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం గమన్హారం.