రొమేనియాలో మరో మోనోలిత్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారిలో కొన్ని రోజుల కిందట మోనోలిత్(లోహపు స్తంభం) కనిపించిన విషయం తెలిసిందే. ఆ నిర్మానుష్య ప్రదేశంలోకి మోనోలిత్ ఎలా వచ్చిందని అధికారులు ఎంక్వైరీ చేసేలోపే, అది అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. అది మనుషులు చేసినా పనా? లేక ఏలియన్స్ చేశారా? అనే మిస్టరీ వీడకముందే ఇప్పుడు అచ్చం అలాంటి మరొక లోహపు దిమ్మె రొమేనియాలో ప్రత్యక్షమైంది. కాగా ఇలా మోనోలిత్‌లు ప్రత్యక్షం కావడం 2020కి ఫైనల్ ట్విస్ట్‌లా మారాయి. యూరప్, […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారిలో కొన్ని రోజుల కిందట మోనోలిత్(లోహపు స్తంభం) కనిపించిన విషయం తెలిసిందే. ఆ నిర్మానుష్య ప్రదేశంలోకి మోనోలిత్ ఎలా వచ్చిందని అధికారులు ఎంక్వైరీ చేసేలోపే, అది అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. అది మనుషులు చేసినా పనా? లేక ఏలియన్స్ చేశారా? అనే మిస్టరీ వీడకముందే ఇప్పుడు అచ్చం అలాంటి మరొక లోహపు దిమ్మె రొమేనియాలో ప్రత్యక్షమైంది. కాగా ఇలా మోనోలిత్‌లు ప్రత్యక్షం కావడం 2020కి ఫైనల్ ట్విస్ట్‌లా మారాయి.
యూరప్, రొమేనియాలో ప్రత్యక్షమైన మోనోలిత్.. పియత్రా నీమ్త్‌లో ఉన్న పురాతన పెట్రోదావా దాసియన్ కోటకు కొన్ని మీటర్ల అవతల ఉంది. ఈ మోనోలిత్ ఎత్తు 13 అడుగులు. కాగా ఉటా ఎడారిలో మాయమైన స్తంభం, ఇది.. రెండు వేరు వేరని చెబుతున్నారు. ‘హఠాత్తుగా ప్రత్యక్షమైన మోనోలిత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మోనోలిత్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, దాని ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది ఆర్కియాలజిక్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండటం వల్ల ఎవరూ దాన్ని టచ్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇలాంటి ఒక వస్తువును పెట్టాలంటే మాత్రం అధికారుల పర్మిషన్ తప్పనిసరి’ అని నీమ్త్ కల్చరల్ అండ్ హెరిటేజ్ అధికారి రాక్సానా జోసను తెలిపారు.
రెండు వారాల్లోనే రెండు చోట్ల మోనోలిత్‌లు కనిపించడం ఇది గ్రహాంతర వాసుల పనే అని కొంతమంది వాదిస్తున్నారు. అయితే 2020లో కరోనా కారణంగా అందరూ ఆర్థికంగా బాగా నష్టపోయారు. దాంతో ‘2001: ఏ స్పేస్ ఒడిస్సీ’ సినిమాలో వలె ఇది కనిపిస్తే, అందరికీ అదృష్టం కలిసి వస్తుందనే భావనతో కొంతమంది ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ఏదేమైనా 2020 ముగింపు కూడా ‘మోనోలిత్’ ట్విస్ట్‌తో ముగుస్తుండటం ఆశ్చర్యకరమే.