బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో కిడ్నాప్, గ్యాంగ్‌రేప్
దిశ, చార్మినార్ : తనను కిడ్నాప్ చేసి ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ 20 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే ల్యాబ్ టెక్నీషియన్ పై ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న యువతి ఫిర్యాదుపై భాగ్యనగరం ఉలిక్కిపడింది. కేసును సవాల్‌గా తీసుకున్న దక్షిణమండలం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్ టు పహాడిషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ […]
దిశ, చార్మినార్ : తనను కిడ్నాప్ చేసి ఆటోడ్రైవర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారంటూ 20 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే ల్యాబ్ టెక్నీషియన్ పై ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న యువతి ఫిర్యాదుపై భాగ్యనగరం ఉలిక్కిపడింది. కేసును సవాల్‌గా తీసుకున్న దక్షిణమండలం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్ టు పహాడిషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగించిన పోలీసులకు చిన్న క్లూ కూడా లభించడం లేదు. ఇది మరో ఘట్కేసర్ ఘటన లా ఫాల్స్ కంప్లైట్..? ఆ అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ల్యాబ్ టెక్నీషియన్‌గా కొత్తగా ఉద్యోగంలో చేరి రెండు మూడు రోజులు అయ్యింది. నేను మంగళవారం రాత్రి 9గంటల సమయంలో ప్యాసింజర్ ఆటోను ఎక్కాను. ఆటో ఎక్కిన సమయంలో నాతో పాటు మరో మహిళ ఉంది. మిథాని డిపో వద్ద తోటి ప్రయాణీకురాలు ఆటో దిగి వెళ్లి పోయింది. నేను అంతలోనే నిద్రకు ఉపక్రమించాను. మెళకువ వచ్చే సరికి ఆటో షాహినగర్‌లో ఉంది. నాతోటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, తనను కిడ్నాప్ చేసి పహాడిషరీఫ్‌లో నిర్మాణుష్యప్రదేశంలోకి తీసుకెళ్లి దారుణంగా హింసించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని 20 సంవత్సరాల యువతి సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనను కిడ్నాప్ చేసి పహాడిషరీఫ్ నిర్మానుష్య ప్రాంతంలో గ్యాంగ్ రేప్ చేశారని మొదట చెప్పిన బాధితురాలు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చిరిగిన బట్టలతో మొదట ఇంటికి వెళ్లానని చెబుతుంది.
తన కుటుంబ సభ్యుల సహాయంతో సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన సంతోష్‌నగర్ పోలీసులు ఐపీసీ 363, 376,(డి) 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సౌత్‌జోన్ డీసీపీ గజరావు భూపాల్ నేతృత్వంలో సంతోష్‌నగర్ ఏసీపీ శివరాం శర్మ లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలు చెప్పినదాని ప్రకారం యాదగిరి థియేటర్ నుంచి పహాడిషరీఫ్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆటో ఎవరిది అని యాదగిరి థియేటర్ సమీప ప్రాంతాలలోని ఆటో డ్రైవర్లను ఆరా దీస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుకు సీన్ ఆఫ్ అఫెన్స్‌కు ఎక్కడా పొంతన లేకపోవడంతో సౌత్ జోన్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఘటకేసర్ లాంటి మరో ఘటనలా పోలీసులు తప్పుదోవ పట్టిస్తుందా..? అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సదరు యువతి ఇంటి నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ కు రెండు కిలో మీటర్ల దూరం కూడా లేదని, యాదగిరి థియేటర్ కి వచ్చి ఆటోఎందుకు ఎక్కింది..? రాత్రి 9 గంటల సమయంలో యాదగిరి థియేటర్ నుంచి పహాడిషరీఫ్ వరకు రద్దీగా ఉండే ప్రాంతం.. కిడ్నాప్ అయితే ఎందుకు ఆరవ లేదు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా ఉదయం నుంచే గ్యాంగ్ రేప్ ఘటన సంతోష్‌నగర్, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగడం గమనార్హం.