'టిమ్స్’ ఆస్పత్రికి మరో ఐదెకరాలు.. అప్పగింతకు సిద్ధంగా అల్వాల్ స్థలం
తెలంగాణ బ్యూరో: నగరం నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం గచ్చిబౌలిలో పనిచేస్తున్న టిమ్స్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిద్దిదాలని భావించడంతో దానికి ఆనుకుని ఉన్న మరో ఐదు ఎకరాల స్థలాన్ని కూడా అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గడ్డి అన్నారం పండల మార్కెట్ స్థలాన్ని కూడా ఇప్పటికే వైద్యారోగ్య శాఖకు అప్పగించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి స్థలం […]
తెలంగాణ బ్యూరో: నగరం నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం గచ్చిబౌలిలో పనిచేస్తున్న టిమ్స్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిద్దిదాలని భావించడంతో దానికి ఆనుకుని ఉన్న మరో ఐదు ఎకరాల స్థలాన్ని కూడా అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గడ్డి అన్నారం పండల మార్కెట్ స్థలాన్ని కూడా ఇప్పటికే వైద్యారోగ్య శాఖకు అప్పగించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి స్థలం ఇప్పటికే వైద్యారోగ్య శాఖ పరిధిలోకి రాగా.. అల్వాల్ ప్రాంతంలో నిర్మించాలనుకున్న స్థలాన్ని గుర్తించే ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కానీ ఆ స్థలంపై ఇంకా స్పష్టత లేనందువల్ల వైద్యారోగ్యా చేతుల్లోకి వెళ్ళలేదు. త్వరలోనే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని అప్పగించే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
నగరం నాలుగు దిక్కులా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను రోడ్లు భవనాల శాఖ నిర్మించనున్నది. వరంగల్‌లో జైలు ఆవరణలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏ డిజైన్‌లో ఉండాలో ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లు ప్రాథమికంగా నమూనా రూపొందించారు. దీన్ని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత ఖరారవుతుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.