మర్కజ్ తరహా మరో ఘటనతో కలవరం
ఢిల్లీ నిజామూద్దీన్ మర్కజ్ ఘటనతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా ఈ తరహా సంఘటనలాగే మరో ఉదాంతం వెలుగు చూడటంతో అధికారుల్లో కలవరం మొదలైంది. యూపీలో ఇటీవల దేవ్బంద్‌లో జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సదస్సుకు హజరైన వారిలో తాజాగా ఇద్దరికి కరోనా సోకింది. వీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మదర్సా సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారి వివారాలు సేకరించే ప్రయత్నం […]
ఢిల్లీ నిజామూద్దీన్ మర్కజ్ ఘటనతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా ఈ తరహా సంఘటనలాగే మరో ఉదాంతం వెలుగు చూడటంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
యూపీలో ఇటీవల దేవ్బంద్‌లో జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది. ఈ సదస్సుకు హజరైన వారిలో తాజాగా ఇద్దరికి కరోనా సోకింది. వీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మదర్సా సమ్మేళనానికి వెళ్లివచ్చిన వారి వివారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దేవ్ బంద్ సదస్సుకు తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సమ్మేళనానికి వెళ్లిన వచ్చిన వారిలో కొందరిని గుర్తించినట్లు తెలుస్తోంది.
tag; delhi markaz incident, corona, up deoband, ts