యాదాద్రిలో మరో కరోనా కేసు
దిశ, నల్లగొండ: ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాని యాదాద్రి-భువనగిరి జిల్లాలో తరలివస్తున్న వలస కార్మికుల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన వలస కార్మికులకు పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. తాజాగా ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్న యాదాద్రి జిల్లా వాసిలో కరోనా నిర్ధారణ అయింది. వలిగొండ మండలంలో 55 ఏళ్ల వ్యక్తిలో వైరస్ వెలుగు చూసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని తన […]
దిశ, నల్లగొండ: ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాని యాదాద్రి-భువనగిరి జిల్లాలో తరలివస్తున్న వలస కార్మికుల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన వలస కార్మికులకు పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. తాజాగా ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్న యాదాద్రి జిల్లా వాసిలో కరోనా నిర్ధారణ అయింది. వలిగొండ మండలంలో 55 ఏళ్ల వ్యక్తిలో వైరస్ వెలుగు చూసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని తన స్వగ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈనెల 12న ముంబయి నుంచి వచ్చాడు. అధికారులు వారందరినీ హోంక్వారంటైన్కు తరలించారు. అందులో 55 ఏళ్ల వ్యక్తికి ఈనెల 18న వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వ్యాధి సోకిన వ్యకి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని 110 మందికి అధికారులు హోంక్వారంటైన్ విధించారు. గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఆరోగ్య అధికారులు ఇంటింటికి తిరుగుతూ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.