కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్… ఆ తండ్రీకొడుకులు జంప్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, పెద్దలు జానారెడ్డి హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నారా..? అంటే అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన జానారెడ్డి.. 2018లో ఓటమి తర్వాత పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. గతంలో సీఎల్పీ నేతగా పనిచేస్తున్న క్రమంలోనే టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా వాస్తవ రూపం దాల్చలేదు. కానీ అప్పట్నుంచే కేసీఆర్‌తో బయటకు కనపడకుండా ఫ్రెండ్‌ షిప్ చేస్తున్నారన్న అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. […]

Update: 2020-12-04 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, పెద్దలు జానారెడ్డి హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నారా..? అంటే అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన జానారెడ్డి.. 2018లో ఓటమి తర్వాత పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. గతంలో సీఎల్పీ నేతగా పనిచేస్తున్న క్రమంలోనే టీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా వాస్తవ రూపం దాల్చలేదు. కానీ అప్పట్నుంచే కేసీఆర్‌తో బయటకు కనపడకుండా ఫ్రెండ్‌ షిప్ చేస్తున్నారన్న అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో కొడుకు రాజకీయ భవిష్యత్‌పై బెంగతో ఉన్న జానారెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరలేక, అటు కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌పై ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వినిపించాయి.

4రోజుల క్రితం నాగార్జుసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఇప్పటికే దుబ్బాకలో విక్టరీ కొట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ రేంజ్‌లో స్టామినా చూపిన బీజేపీ ఇప్పుడు సాగర్‌ అసెంబ్లీ స్థానంపై కన్నేసి.. ఎలాగైనా ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోందన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో జానారెడ్డికి కాషాయ కండువా కప్పేందుకు సైతం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్న గుసగుసలు వినపడుతున్నాయి. బండి సంజయ్‌, మరో జాతీయ నేత.. జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

రెండ్రోజుల నుంచి నడుస్తోన్న చర్చల్లో భాగంగా జానారెడ్డి రెండు డిమాండ్లను బీజేపీ హైకమాండ్ ముందు ఉంచినట్లు సమాచారం. ఈ రెండు ప్రతిపాదనలకు బండి సంజయ్, కిషన్‌రెడ్డి హామీ ఇవ్వడమే గాక జాతీయ నేతలతో సైతం ఫోన్‌లో మాట్లాడించారని తెలుస్తోంది. అయితే ఆ రెండు డిమాండ్లు ఏమై ఉంటాయా అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా బీజేపీ వైపు యువకులు మొగ్గు చూపుతున్నందున త్వరలో రాష్ట్ర బీజేపీకి మంచి భవిష్యత్ ఉంటుందని, రఘువీర్‌రెడ్డి పార్టీలో చేరితే జిల్లా రాజకీయాల్లో కీలక బాధ్యతలు వస్తాయని చర్చల సందర్భంగా కాషాయ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. జానారెడ్డి, రఘువీర్‌రెడ్డి సైతం పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది.

జానారెడ్డి కొంపలో కుంపటి.. బీజేపీ బిగ్ ప్లాన్ ?

Full View

Tags:    

Similar News