గుంజపడుగ బ్యాంకు రాబరీలో మరోకరి అరెస్ట్

దిశ పెద్దపల్లి : గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకు దొంగతనం కేసులో మరో నిందితుడు జహాంగీర్ అలియాస్ మాస్టర్‌ను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి వద్ద నుండి 99.260 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.3500 ల నగదుతో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నమని వెల్లడించారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పట్టుకొని వారి నుండి సుమారు 3.2 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు […]

Update: 2021-06-02 08:52 GMT

దిశ పెద్దపల్లి : గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకు దొంగతనం కేసులో మరో నిందితుడు జహాంగీర్ అలియాస్ మాస్టర్‌ను అరెస్టు చేసినట్లు రామగుండం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి వద్ద నుండి 99.260 గ్రాముల బంగారు ఆభరణాలు రూ.3500 ల నగదుతో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నమని వెల్లడించారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పట్టుకొని వారి నుండి సుమారు 3.2 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఈ నిందితునితో పాటు బ్యాంక్ దొంగతనంలో పాల్గొన్న మరో 5 గురు నిందితులను చంద్రపూర్ జైల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంథని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ చేశామన్నారు. నిందితునికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మంథని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి తదుపరి 14 రోజుల జుడీష్యల్ రిమాండ్ కి పంపినట్లు తెలిపారు. నిందితుని నుండి ఇంకా సమాచారం రాబట్టవలసి ఉన్నందున, కోర్టులో కస్టడి పిటిషన్ వేస్తామన్నారు.

Tags:    

Similar News