తెలంగాణలో మరో 7 మెడికల్ కాలేజీలు

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో 7 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 నుంచి 2018 […]

Update: 2021-05-30 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో 7 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 నుంచి 2018 మధ్య ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, తాజాగా.. మరో ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News