తెలంగాణకు మరో మూడ్రోజులు వర్ష సూచన!

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇప్పటికే వానలు జోరుగా కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని రిజర్వాయర్‌లు, కాలువలు జలకళ సంతరించుకున్నాయి.ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని దీనికి అనుబంధంగా 3.6 కి.మీ ఎత్తు మేర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని […]

Update: 2020-08-06 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇప్పటికే వానలు జోరుగా కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని రిజర్వాయర్‌లు, కాలువలు జలకళ సంతరించుకున్నాయి.ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది.

నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని దీనికి అనుబంధంగా 3.6 కి.మీ ఎత్తు మేర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఇదివరకే వెల్లడించారు. బుధవారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Tags:    

Similar News