ఏపీలో 186 కొత్త కేసులు.. ఇద్దరు మృతి
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. దాదాపు వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య మూడంకెల్లో నమోదవుతుండటంతో వైద్యశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా, 14,477 శాంపిళ్లను పరీక్షించగా, 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,858కు చేరింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 4,588 మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 202మంది, ఇతర రాష్ట్రాల […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. దాదాపు వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య మూడంకెల్లో నమోదవుతుండటంతో వైద్యశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా, 14,477 శాంపిళ్లను పరీక్షించగా, 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,858కు చేరింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 4,588 మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 202మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068మంది ఉన్నారు.
శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 42మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,641కి పెరిగింది. వైరస్ బారినపడి కొత్తగా కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 82కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,865 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.