పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా అనితా రాజేంద్ర

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్రకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆ బాధ్యతలను ఐఏఎస్‌కు అప్పగించాల్సి రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్రకు అప్పగించారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీష్, గోట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీ, డెయిరీ బాధ్యతలను అనితా రాజేంద్రకు బదిలీ […]

Update: 2020-07-31 11:34 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్రకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగిసింది.

దీంతో ఆ బాధ్యతలను ఐఏఎస్‌కు అప్పగించాల్సి రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్రకు అప్పగించారు. పశుసంవర్థక శాఖ, ఫిషరీష్, గోట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీ, డెయిరీ బాధ్యతలను అనితా రాజేంద్రకు బదిలీ చేశారు.

Tags:    

Similar News