ఒలింపిక్స్‌లో అనిర్బన్ లాహిరి
దిశ, స్పోర్ట్స్: భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి అనూహ్యంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌కు సంబంధించిన గోల్ఫ్ ర్యాకింగ్స్ ప్రకారం ఇండియాకు చివరిదైన 60వ స్పాట్ దక్కింది. కాగా, భారత గోల్ఫర్లలో టాప్ ర్యాంకర్ అయిన అనిర్బన్‌కు ఆ స్పాట్ కేటాయించారు. అసలు ఇండియాకు గోల్ఫ్‌లో చోటు దక్కుతుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో గోల్ఫ్ ర్యాంకింగ్స్ అనుకూలంగా మారాయి. మిగిలిన ఒక్క స్థానం అనిర్బన్‌కు దక్కడం విశేషం. ప్రస్తుతం పీజీఏ టూర్‌లో […]
దిశ, స్పోర్ట్స్: భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి అనూహ్యంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ గేమ్స్‌కు సంబంధించిన గోల్ఫ్ ర్యాకింగ్స్ ప్రకారం ఇండియాకు చివరిదైన 60వ స్పాట్ దక్కింది. కాగా, భారత గోల్ఫర్లలో టాప్ ర్యాంకర్ అయిన అనిర్బన్‌కు ఆ స్పాట్ కేటాయించారు. అసలు ఇండియాకు గోల్ఫ్‌లో చోటు దక్కుతుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో గోల్ఫ్ ర్యాంకింగ్స్ అనుకూలంగా మారాయి. మిగిలిన ఒక్క స్థానం అనిర్బన్‌కు దక్కడం విశేషం.
ప్రస్తుతం పీజీఏ టూర్‌లో 118వ స్థానంలో ఉన్న అనిర్బన్.. భారత గోల్ఫర్లలో టాప్ ర్యాంకులో ఉన్నాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై అనిర్బన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘నేను ఇది ఊహించలేదు. నిజంగా చాలా ఆశ్చర్యపరిచింది’ అని అనిర్బన్ వ్యాఖ్యానించాడు. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న అనిర్బన్ 57వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.